శ్రీరామ్ చంద్ర గెలుపు కోసం రంగంలోకి దిగిన యాంకర్ రవి

బిగ్ బాస్ ఫైనల్ సభ్యులలో శ్రీరామ్ చంద్ర కూడా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వోటింగ్ లో మూడో స్థానంలో ఉన్నారు. ఈయన ను గెలిపించడం కోసం మాజీ హౌస్ సభ్యుడు యాంకర్ రవి రంగంలోకి దిగాడు.

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ వారానికి వచ్చేసింది. ఈ వారంలో ఎవరు బిగ్ బాస్ 5 విన్నరో తేలిపోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ లో సన్నీ , మానస్ , శ్రీరామ చంద్ర , షన్ను , సిరి లు ఉన్నారు. నిన్నటి నుండే ఆడియన్స్ వోటింగ్ మొదలైంది. ఫస్ట్ డే సన్నీ కి గుద్దిపడేసారు. ప్రస్తుతం సన్నీ టాప్ లో ఉండగా.. షన్ను రెండో ప్లేస్ లో , శ్రీరామ చంద్ర మూడో ప్లేస్ లో మానస్ నాల్గో స్థానంలో ఉండగా..సిరి చివరి స్థానంలో ఉంది. ఈ క్రమంలో సోషల్ మీడియా లో అభిమానులే కాదు బుల్లితెర నటి నటులు, పలువురు యాంకర్లు సైతం తమ మద్దతును తెలుపుతూ ఓట్ చేయాలనీ కోరుతున్నారు. తాజాగా యాంకర్‌ రవి సింగర్‌ శ్రీరామ్‌ కోసం రంగంలోకి దిగాడు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్న ఐదుగురూ డిజర్వింగ్‌ అంటూనే ఆ టైటిల్‌ మాత్రం శ్రీరామ్‌కే దక్కాలంటూ ప్రచారం మొదలు పెట్టాడు.

అందులో భాగంగా ఆటోను సైతం నడిపాడు. ‘అన్నపూర్ణ స్టూడియో హౌస్‌, బిగ్‌బాస్‌ హౌస్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌..’ అని అరుస్తూ ఆటోవాలాగా మారిపోయాడు. ‘బిగ్‌బాస్‌ సీజన్‌ 5 గెలిచేది ఒకే ఒక్కరు.. అది శ్రీరామచంద్ర మాత్రమే.. అతడికే ఓటేయండి’ అంటూ ఆటో నడిపాడు. ఈ ఆటో వెనకాల శ్రీరామ్‌ను గెలిపించాలంటూ పోస్టర్‌ కూడా ఉంది. View this post on Instagram

A post shared by Sreerama Chandra (@sreeramachandra5)