యాంకర్‌ ప్రదీప్‌పై పోలీసు కేసు నమోదు

Pradeep Machiraju
Pradeep Machiraju

హైదరాబాద్: ప్రముఖ బుల్లితెర యాంకర్, నటుడు ప్రదీప్ మాచిరాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. సునిశిత్ అనే యువ డైరెక్టర్ ప్రదీప్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ నిభంధనలకు విరుద్దంగా 2 రోజులు జైలు శిక్ష అనుభవించిన ప్రదీప్ హీరోగా నటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. ప్రదీప్ రూల్స్ బ్రేక్ చేశాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కాగా, ప్రస్తుతం ప్రదీప్ గ30 రోజుల్లో ప్రేమించడం ఏలాగ అనే సిన్మాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/