అనూ.. ఇలా అయితే ఎలా..?

బుల్లితెర , వెండితెర పాపులర్ యాక్టర్ అనసూయ..ఫ్లోరల్ డిజైనరీ లెహంగాలో దర్శనం ఇచ్చి యూత్ ను మరోసారి కట్టిపడేసింది. జబర్దస్త్ షో తో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న అనసూయ..వెండితెర ఫై కూడా రాణిస్తూ వస్తుంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్ర ద్వారా ఆమెలో మంచి నటి ఉందని విషయాన్నీ బయటపెట్టింది. ఆ తర్వాత నుండి వరుస అవకాశాలు అమ్మడి తలుపు తడుతూనే ఉన్నాయి.

తాజాగా ఆమె ‘విమానం’ సినిమాలో నటించారు. ఇటీవల విడుదలైన ఒక పాట అనసూయ పాత్ర ఎలా ఉండబోతోందో చూపించింది. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో నిత్యం యాక్టివ్ గా ఉండే ఈ భామ..తాజాగా ఓ ఫొటో షూట్ కు సంబదించిన పిక్స్ ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ ఫొటోల్లో అనసూయ చాలా అందంగా ఉన్నారంటూ , ముఖ్యంగా ఆమె వేసుకున్న దుస్తులు చాలా బాగున్నాయని కామెంట్స్ వేస్తున్నారు.

ప్రస్తుతం ఆమె చేతిలో ‘అరి’, ‘విమానం’, ‘పుష్ప 2’, తమిళ చిత్రం ‘ఫ్లాష్ బ్యాక్’ ఉన్నాయి. వీటిలో ‘విమానం’ విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో సుమతి అనే బోల్డ్ క్యారెక్టర్‌లో ఆమె నటించారు. ఇప్పటి వరకు అనసూయ ఏ సినిమాలో చేయనటువంటి పాత్ర ఇదని చిత్ర యూనిట్ చెబుతోంది.