ట్రెండీ డ్రెస్‌లో మతిపోగొడుతున్న అనసూయ

అనసూయ ..ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెర , వెండితెర ప్రేక్షకులను తన అందం తో , నటన తో ఆకట్టుకుంటుంది. ఇద్దరి పిల్లలకు తల్లైనప్పటికీ హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గని అందం ఈమె సొంతం. జబర్దస్త్ షో తో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈమె..ప్రస్తుతం టీవీ షోస్ తో పాటు మూవీస్ లలో నటిస్తూ అలరిస్తుంది. అలాగే సోషల్ మీడియా లోను అను చాల యాక్టివ్ గా ఉంటుంది. సామజిక అంశాల పట్ల స్పందిస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్స్ ఫాలో అవుతూ..తన అభిమానుల్నీ ఆకట్టుకుంటూ వస్తుంటుంది.

ఈ మధ్యనే చీరలో ఆకట్టుకున్న ఈమె..తాజాగా ట్రెండీ ఫోటో షూట్ లో మతిపోగొట్టింది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ..అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప మూవీ లో ఓ కీలక పాత్రలో నటిస్తుంది. సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం మూవీ లో రంగమ్మత్త గా ఆకట్టుకున్న ఈమె..ఈ మూవీ లో ఏ పాత్ర చేస్తుందో అని అంత ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. అలాగే చిరంజీవి ఆచార్య , రవితేజ ఖిలాడీ తో పాటు మలయాళ మూవీ లో కూడా నటిస్తుంది.