నేడు గవర్నర్‌తో భేటి కానున్న పవన్‌

ట్విట్టర్ లో వెల్లడించిన జనసేన

Pawan Kalyan
Pawan Kalyan

అమరావతి: ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో ఈ మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన వెలువడింది. ‘జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను రాజ్ భవన్ లో కలుస్తారు’ అని వెల్లడించింది. కాగా, ఈ భేటీ ఎందుకోసమన్న వివరాలు వెల్లడి కాలేదు. అయితే, తాజా రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, ఇసుక సమస్య తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/