మహారాష్ట్ర రాజకీయాలపై ఆనంద్ మహింద్రా ట్వీట్

Anand Mahindra
Anand Mahindra

ముంబయి: ప్రముఖ వ్యాపారం దిగ్గజం ఆనంద్‌ మహింద్రా మహారాష్ట్రలోని రాజకీయ పరిణామాలపై ఓ ట్వీట్‌ చేశారు. దానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆయన షేర్‌ చేసిన వీడియోలో కబడ్డీ పోటీ జరుతున్న ఇరుజట్లలోని ఓ జట్లు ఆటగాడు కూతకు వచ్చి ప్రత్యర్థి జట్టు ఆటగాడిని అవుట్‌ చేస్తాడు. వెళ్తూ వెళ్తూ మధ్యలో ఆగి ఆటగాళ్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేయగా, ఔటైన ఆటగాడు వచ్చి ధీమాగా నిల్చున్న అతడిని ఒక్కసారిగా తమవైపు లాక్కుంటాడు. అంతే క్షణాల్లో అప్రమత్తమైన ఆటగాళ్లు వెంటనే అతడిని గట్టిగా బిగించి పాయింట్‌ గెలుచుకుంటారు. పాయింట్‌ సంపాదించినట్లు కనిపించిన జట్టు అంతలోనే కోల్పోయింది. దీంతో ఆట తీరు క్షణాల్లోనే మారిపోయింది. ఈ వీడియో మహారాష్ట్ర రాజకీయాలకు సరిగ్గా సరిపోతుందని పేర్కొంటూ ఆనంద్‌ మహింద్రా చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana