గాల్లో రవీంద్ర జడేజా సూపర్‌ క్యాచ్‌

ఫిదా అయిన వ్యాపార దిగ్గజం ఆనంద్‌ మహీంద్ర

Ravindra Jadeja superb catch
Ravindra Jadeja superb catch

న్యూఢిల్లీ: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత ఆటగాడు రవీంద్ర జడేజా అద్భుత క్యాచ్‌ పట్టాడు. సూపర్‌ మ్యాన్‌ రేంజ్‌లో ఆయన ఎగిరి పట్టిన ఆ క్యాచ్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. షమీ వేసిన బంతిని కివీస్‌ బ్యాట్స్‌మన్‌ వాగ్నర్‌ స్వ్కెర్‌ లెగ్‌లో భారీ షాట్‌ బాదాడు. అది అలాగే వెళ్లి బౌండరీ దాటుతుందని అందరూ భావించారు. అయితే, ఫీల్డింగ్‌ చేస్తున్న జడేజా ఎవరి అంచనాలకు అందని విధంగా గాల్లోకి ఎగిరి క్యాచ్‌ అందుకుని ఔరా అనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్‌ ఖాతాలో షేర్ చేస్తూ ప్రశంసల జల్లు కురిపించారు. ఆదివారం ఉదయం కనపడిన అద్భుతమైన దృశ్యమని ఆయన పేర్కొన్నారు. మనకు అందకుండా బంతి వెళ్లిపోతుందనుకున్నామని ఆయన అన్నారు. కానీ, సాధ్యమైనంత మేరకు ప్రయత్నిస్తే మనం దాన్ని పట్టేయవచ్చని తెలిపారు. అలాగే, సాధ్యమైనంత మేరకు ప్రయత్నిస్తే మళ్లీ ఆటలో కూడా రాణించవచ్చని సందేశమిచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/