ప్రధాని ఆర్థిక ప్యాకేజీపై పారిశ్రామిక దిగ్గజాలు

అభివృద్ధి పథంలో కీలక అడుగు..

Gautam Adani-anand mahindra

ముంబయి: ప్రధాని నరేంద్రమోడి నిన్న జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో దేశ ఆర్థిక వ్యవస్థకు ఊపరిలూదేందుకు రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈప్యాకేజిని పారిశ్రామిక దిగ్గజాలు స్వాగతించాయి. ఈనేపథ్యలో ఆర్థిక ప్యాకేజీపై పలువు ప్రముఖుల అభిప్రాయాలు..


.ప్రధాని ప్రసంగంపై స్పందించిన మహీంద్రా గ్రూప్ సంస్థల అధినేత ఆనంద్ మహీంద్రా, ప్రధాని ప్రసంగం అందరి దృష్టినీ తనవైపునకు తిప్పుకుందని అన్నారు. బతికితే చాలనుకునే స్థాయి నుంచి, బలపడే స్థాయికి మారేందుకు అవకాశాన్ని దగ్గర చేసిందని ఆనంద్ మహీంద్రా, తన ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్యానించారు. ఇది 1991లో ఇండియాలో వచ్చిన ఆర్థిక పరివర్తనా క్షణాల వంటివేనా? కాదా? అన్నది రేపటి రోజుల్లో తెలుస్తుందనీ, ప్రధాని ప్రసంగం చూసిన తరువాత, తనకు ఈ రాత్రి సరిగ్గా నిద్రపట్టదేమోనని ఆయన చమత్కరించారు.

మరోవైపు గౌతమ్ అదానీ స్పందిస్తూ, ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ, కేవలం చారిత్రాత్మకమే కాదని, భూమి, కార్మికులు, ద్రవ్య లభ్యత, చట్టాలు తదితర ఎన్నో విభాగాలపై దృష్టి సారించిన అద్భుతమని కొనియాడారు. దీని వల్ల ఎంతో మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఇండియాను వృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లే దిశగా, నరేంద్ర మోడి, ఆయన ప్రభుత్వం ఓ కీలకమైన అడుగు వేసిందని వ్యాఖ్యానించారు. కాగా ఈ ప్యాకేజీ సమగ్ర స్వరూపాన్ని నేడు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించనన్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/