కాంగ్రెస్ అత్యవసర సమావేశం

మహారాష్ట్రలో తాజా పరిణామాల నేపథ్యంలో

Congress party
Congress party

ముంబయి: మహారాష్ట్రలో తాజా పరిణామాల సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తమ పార్టీ ఎమ్మెల్యెలతో అత్యవసర సమావేశానికి ఏర్పాటు చేసింది. కాగా మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చించి భవిష్యత్ లో అవలంభించాల్సిన వ్యూహంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్ పార్టీల మధ్య ఏకాభిప్రాయసాధనలో తీవ్ర జాప్యం జరిగిన నేపథ్యంలో బిజెపి ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్ధతుతో సర్కారును ఏర్పాటు చేసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశంలో చర్చించి భవిష్యత్ వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ్యుల సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జునఖర్గే, కేసీ వేణుగోపాల్ లు హాజరు కానున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/