ఆమెను జైల్లో పెట్టినా నాకు అభ్యంతరం లేదు

నా కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యా: అమూల్య తండ్రి

Amulya-Leon
Amulya-Leon

బెంగళూరు: బెంగళూరులో సీఏఏకు వ్యతిరేకంగా నిర్వహించిన ‘సేవ్ కాన్‌స్టిట్యూషన్’ కార్యక్రమంలో అమూల్య అనే అమ్మాయి పాకిస్థాన్ జిందాబాద్‌ అంటూ నినాదాలు చేసి రచ్చ చేసిన విషయం తెలిసిందే. ఆమె తండ్రి ఈ విషయంపై స్పందించారు. తన కూతురి ప్రవర్తన చూసి దిగ్భ్రాంతికి గురయ్యానని ఆయన చెప్పారు. ఆమెను జైల్లో పెట్టినా, పోలీసులు ఆమె కాళ్లు విరగ్గొట్టినా తన ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయొద్దని తాను ఆమెకు చాలా సార్లు చెప్పానని, అయినప్పటికీ తన కూతురిలో ఎలాంటి మార్పు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి వల్ల తన కుటుంబం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోందని, ఆమెను జైల్లోంచి తీసుకురావడానికి తానే న్యాయవాదులను సంప్రదించబోమని స్పష్టం చేశారు. కాగా, ఆమెకు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించిన న్యాయస్థానం, 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన విషయం తెలిసిందే. కాగా పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌పీఆర్‌, ఎన్నార్సీకి వ్యతిరేకంగా బెంగళూరులో నిర్వహించిన ఈ సభలో మజ్లీస్‌ అధినేత, ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ హాజరై ప్రసంగించారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/