అమరావతిలో వినూత్నంగా సంక్రాంతి సంబరాలు

భోగి మంటల్లో హైపవర్‌ కమిటీ నివేదికలు వేసిన పలువురు నేతలు

Chandrababu
Chandrababu

అమరావతి: ఏపి రాజధాని అమరావతి ప్రజలు సంక్రాంతి సంబరాలను వినూత్నంగా ప్రారంభించారు. భోగి మంటల్లో హైపర్‌ కమిటీ, జిఎన్‌ రావు, బోస్టన్‌ కమిటీల పత్రాలను వేసి నిరసనలు తెలిపారు. రాజధాని పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ బెంజిసర్కిల్‌ సమీపంలో నేతలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు, కేశినేని నాని, గద్దె రామ్మోహన్‌రావు, వర్ల రామయ్య తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మహిళలు, విద్యార్థులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా జిఎన్‌రావు, బోస్టన్‌ కమిటీ ప్రతిపాదించిన నివేదికలను భోగి మంటల్లో వేసి నాయకులంతా ప్రజలతో కలిసి నిరసన తెలిపారు. ఆంధ్రులంతా ఒక్కటే.. రాజధాని కూడా ఒక్కటే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏపికి మూడు రాజధానులు ప్రతిపాదనను విరమించుకోవాలని వారంతా డిమాండ్‌ చేశారు. మరోవైపు తూళ్లూరులో మహాధర్నా శిబిరం వద్ద కూడా భోగి మంటల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌, మాజీ ఎంపి మాగంటి బాబు తదితరులు పాల్గొన్నారు. జిఎన్‌రావు, బోస్టన్‌, హైపవర్‌ కమిటీ పత్రాలను భోగి మంటల్లో వేసి నేతలు నిరసన తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/