జనతా కర్ఫ్యూనకు అమరావతి రైతుల సంఘీభావం

నిరసనలకు తాత్కాలిక విరామం

జనతా కర్ఫ్యూనకు అమరావతి  రైతుల సంఘీభావం

Amravati: జనతా కర్ఫ్యూను దేశవ్యాప్తంగా ప్రతిఒక్కరూ బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు. ఈ విషయంలో అమరావతి రాజధాని రైతులు కూడా ముందుకొచ్చారు.

స్వచ్ఛంద కర్ఫ్యూలో రైతులందరూ భాగస్వాములయ్యారు. తమ నిరసనలకు తాత్కాలికంగా విరామం ఇచ్చారు.

జనతా కర్ఫ్యూ సందర్భంగా ఇవాళ ఉదయం 6 గంటల వరకు నిరసన శిబిరాల్లో ఉన్న రైతులు.. తర్వాత ఎవరి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోయారు.

బాధ్యతాయుతమైన పౌరులుగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తించామని..

మళ్లీ రేపు నిరసనలను కొనసాగిస్తామని రైతులు తెలిపారు. ప్రస్తుతం దీక్షా శిబిరాలు ఖాళీగా కనపడుతున్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం :https://www.vaartha.com/news/business/