‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ మహా పాదయాత్ర

అమరావతి రైతుల యాత్రకు విపక్ష పార్టీలు పెద్దఎత్తున మద్దతు

Amaravati: అమరావతి రైతులు నిర్వహిస్తున్న ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’మహా పాదయాత్ర సాగుతోంది. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి పరిరక్షణ కోసం ఈ యాత్రను చేపట్టారు. పెద్ద ఎత్తున రైతులు, మహిళలు, వివిధ రాజకీయపక్షాల నేతలు పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా , ఈ మహా పాదయాత్ర మొత్తం 45 రోజులపాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 17న తిరుపతిలో ముగియనుంది. కాగా , అమరావతి రైతుల యాత్రకు విపక్ష పార్టీలు పెద్దఎత్తున మద్దతు తెలిపాయి.

Opposition parties support farmers' 'Mahaa Paadayatra'
Opposition parties support farmers’ ‘Mahaa Paadayatra’

శుక్రవారం పాదయాత్ర ఇలా..
శుక్రవారం ఉదయం 8:00 గంటలకు
ప్రత్తిపాడు మండలం తిక్కిరెడ్డిపాలెం నుండి భోజన విరామ సమయం/ ప్రాంతం:- పెద్దనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం. ఆనంతరం పెద్దనందిపాడు మండలం అబ్బినేనిగుంటపాలెం నుంచి మధ్యాహ్నం 3 : 00 గంటలకు ప్రారంభం అవుతుంది ఇవాళ పాదయాత్ర సుమారు 15 కిలోమీటర్లు . రాత్రికి . పెద్దనందిపాడు మండలం పెద్దనందిపాడు క్లబ్ వద్ద బస.

జాతీయ వార్తలకు https://www.vaartha.com/news/national/