తీరాన్ని తాకిన అంఫాన్‌ తుపాన్‌

పశ్చిమ బెంగాల్ తీరంలోని దిఘా, బంగ్లాదేశ్‌లోని హతియా ఐలాండ్ మధ్య తీరాన్ని తాకినట్టు భారత వాతావరణ శాఖ వెల్లడి

cyclone-amphan

కోల్‌కతా: అతి తీవ్ర తుపాను అంఫాన్‌ పశ్చిబెంగాలో తీరాన్ని తాకింది. మధ్యాహ్నం 2.30 గంటలకు తుపాను తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుఫాన్ తీరాన్ని తాకే ప్రక్రియ సుమారు నాలుగు గంటల పాటు కొనసాగనుంది. ఆ సమయంలో బీభత్సంగా గాలులు వీస్తాయి. తుఫాన్ తీరాన్ని తాకే సమయంలో 160 కిలోమీటర్ల వేగం నుంచి 170 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. ఒక్కోసారి 190 కి.మీ వేగంతో కూడా గాలులు వీయవచ్చు. భారీ వర్షం కురుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో దమ్ దమ్ విమానాశ్రయం వద్ద 75 కి.మీ వేగంతో గాలులు వీచినట్టు వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ మొత్తం తీరాన్ని దాటడానికి సాయంత్రం 6.30 అవ్వొచ్చని అంచనా. అంఫాన్‌ తుఫాన్ కారణంగా సుమారు 20 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి, 12,078 షెల్టర్లలో ఉంచినట్టు బంగ్లాదేశ్ ప్రకటించింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/