సిద్దిపేటలో భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత

ammonium nitrate bags
ammonium nitrate bags

సిద్దిపేట : అక్కన్నపేట మండలం కట్కూరులో బుధవారం భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు పట్టుకున్నారు. అనుమతి లేకుండా లారీలో తరలిస్తున్న 360 బ్యాగుల అమ్మోనియం నైట్రేట్‌ను సీజ్‌ చేశారు. ఈ ఘటనలో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. అమ్మోనియం నైట్రేట్‌ను కర్నాటక నుంచి రాజస్థాన్‌కు తరలిస్తుండగా పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు తరలించే వారి ఆచూకీ తమకు ఇవ్వాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను కోరారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/