కేసీఆర్‌ చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు

Amith Shah
Amith Shah

Warangal: కేసీఆర్‌ ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అన్నారు. వరంగల్‌ జిల్లా పరకాలలో జరుగుతున్న బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్లు 51 శాతానికి మించొద్దని సుప్రీం కోర్టు చెప్పిందన్నారు. ఎవరి రిజర్వేషన్లకు కోతపెట్టి ముస్లింలకు కేసీఆర్‌ రిజర్వేషన్లు కల్పిస్తారని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికల వల్ల తెలంగాణ ప్రజలపై అదనపు భారం పడిందన్నారు. కొడుకు, కూతుళ్లను గెలిపించుకోవడానికే ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తున్నారని విమర్శించారు.