దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వేడుకకు రాలేకపోతున్న

కేంద్రానికి అమితాబ్ లేఖ

Amitabh-Bachchan
Amitabh-Bachchan

ముంబయి: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఈరోజు ఢిల్లీలోని విజ్ఞాన భవన్‌లో వేడుకగా జరుగనుంది. ఈ వేడుకలో నటీనటులకు జాతీయస్థాయిలో అవార్డులను అందజేయనున్నారు. అంతేకాక దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డును కూడా ఇవ్వనున్నారు. అయితే బాలీవుడ్ షెహెన్‌షా అమితాబ్ బచ్చన్‌‌కు కేంద్రం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో గౌరవించింది. ఈ అవార్డు అందుకుంటున్న 50వ వ్యక్తి అమితాబ్ బచ్చన్. ఈ రోజు జాతీయ అవార్డులో భాగంగా కేంద్రం ఈ అవార్డులను ప్రధానం చేయనుంది. తాజాగా అమితాబ్ బచ్చన్ ఈ అవార్డు అందుకోవడానికి రాలేకపోతున్నట్టు ట్వట్టర్‌లో వెల్లడించారు. గత రెండు మూడు రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న మూలంగా ఈ అవార్డు స్వీకరించేందుకు రాలేకపోతున్నానని బిగ్‌బీ పేర్కొన్నారు. జ్వరం కారణంగా ముంబాయి నుంచి ఢిల్లీకి ప్రయాణం చేయలేనన్నారు. జాతీయ చలన చిత్ర అవార్డులను రాష్ట్రపతి అందజేయడం ఆనవాయితీ. ఈ సారి ఈ అవార్డులను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతులు మీదుగా అందజేయనున్నారు. కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ అవార్డు ఉత్సవంలో పాల్గొంటారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/