కోహ్లీని పొగడ్తలతో ముంచెత్తిన అమితాబ్‌

Amitabh Bachchan
Amitabh Bachchan

ముంబయి: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని పొగడ్తలతో ముంచేశారు. విరాట్‌ను కవ్వించొద్దని ఎన్నోసార్లు చెప్పానని, అయినా వారు వినలేదని, ఇప్పుడు కోహ్లీ చిట్టి రాసి చేతిలో పెట్టాడు, చూడండి విండీస్‌ ప్లేయర్ట ముఖాలు ఎలా మాడిపోయాయో అని, బిగ్‌ బి నటించిన అమర్‌ అక్బర్‌ ఆంథోని సినిమాలోని హిట్‌ డైలాగ్‌తో విరాట్‌ను కొనియాడారు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన టీ20 లో వెస్టిండీస్‌పై భారత్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. కోహ్లీ మరోసారి చెలరేగి జట్టును గెలిపించారు. విండీస్‌ ఆటగాడు విలియమ్స్‌ను ఉద్దేశించి కోహ్లీ బుక్‌ తీసి టిక్‌ పెట్టినట్లు చేసిన తీరు ఇప్పుడు వైరల్‌గా మారింది. గత వెస్టిండీస్‌ పర్యటనలో కోహ్లీని ఔట్‌ చేసినప్పుడు విలియమ్స్‌ చేసిన సంబరాన్ని దృష్టిలో పెట్టుకుని కోహ్లీ ఇలా బదులు చెప్పారు. కాగా ఈ అంశంపై బిగ్‌ బి ట్వీట్‌ చేయగా నెటిజన్లు ఈ ట్వీట్‌ అమితాబ్‌ స్వరంతో వినాలని ఉందని కామెంట్లు పెడుతున్నారు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/