అమితాబ్ బచ్చన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు


ట్విట్టర్ లో వెల్లడించిన కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్

Amitabh Bachchan
Amitabh Bachchan


న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ సినీరంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అ వార్డు అందుకోబోతున్నారని సమాచార ప్ర సారాల మంత్రి ప్రకాష్ జవదేకర్ మంగళవారం ట్వీట్ చేశారు. ‘రెండు తరాల ప్రేక్షకులకు వినోదాన్ని పంచి, ప్రేరణగా నిలిచిన లెజెండ్ యా క్టర్ అమితాబ్ బచ్చన్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ఏకగ్రీవం గా ఎంపికయ్యారు. దేశం మొత్తానికి, అంతర్జాతీయంగాను ఇది సంతోషకరమైన విష యం. ఆయనకు నా హృదయపూర్వక అభినందనలు’ అని జవదేకర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ అవార్డుకు ఎంపికైన మొదటి నటి దేవికా రాణి. 17 వ జాతీయ చలనచిత్ర అవార్డుల ఉత్సవంలో ఆమె ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2017 వరకు 49 మందికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. పృథ్వీరాజ్ కపూర్, వినోద్‌ఖన్నాలకు మరణానంతరం ఈ అవార్డు లభించింది. వ్యాపారాత్మక చిత్రాలతో పాటు కళాత్మక చిత్రాల్లో కూడా నటించి అమితాబ్ తనకు సాటి లేదనిపించుకున్నారు. జంజీర్, దీవార్, షోలే, పింక్, పా అండ్ పికు వంటి సినిమాలు ఆయన ప్రతిభకు దర్పణం పట్టాయి. ప్రభుత్వం ఆయనకు 1984 లో పద్మశ్రీ, 2001లో పద్మభూషణ్, 2015లో పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/