అమితాబ్‌ బచ్చన్‌ రూ.51 లక్షల విరాళం

అమితాబ్‌ బచ్చన్‌  రూ.51 లక్షల విరాళం
Amitabh Bachchan donates Rs 51 lakhs

Patna: బీహార్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్‌ఎఫ్‌)కు బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ 51 లక్షల రూపాయిల విరాళం అందజేశారు. బీహార్‌లోని 12 జిల్లాలు వరద భీభత్సానికి గురైన వార్తలకు స్పందించిన అమితాబ్‌ బచ్చన్‌ విరాళం ప్రకటించారు. ఈ మేరకు 51 లక్షల రూపాయిల చెక్‌ను, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ను ఉద్దేశించి రాసిన లేఖను అమితాబ్‌ ప్రతినిధి విజయ్‌ నాథ్‌ మిశ్రా బీహార్‌ ఉప ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోడీకి అందజేశారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/