అమిత్‌షా తదుపరి లక్ష్యం ఆరెస్సెస్పైనేనా!

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి, బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరెస్సెస్‌పై తన దృష్టిని కేంద్రీకరించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు బిజెపి పాలిత రాష్ట్రాల్లోనూ నక్సలిజం ప్రధాన సమస్యగా ముందుకొస్తుండటం పట్ల ఆరెస్సెస్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. నక్సలిజం ఎదుర్కొనేందుకు దీటైన బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని ఆరెస్సెస్ కోరుతోంది. అర్బన్ నక్సల్ పేరును పెద్ద ఎత్తున ప్రచారం చేయడం ద్వారా బిజెపి, ఆరెస్సెస్ మావోయిస్టుల సానుభూతిపరులను లక్ష్యంగ చేసే వ్యూహానికి పదును పెట్టాయి. నక్సల్ ప్రభావిత రాష్ట్రాల సిఎంలు, పోలీస్ ఉన్నతాధికారులతో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా భేటీ అయ్యారు. కేంద్ర హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిపిన తొలి భేటీ ఇదే. వాపక్షప తీవ్రాద ప్రాబల్యం కలిగిన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం సానుకూలంగా సాగినట్లు అమిత్‌షా ట్విట్ చేశారు. నక్సల్‌ను దీటుగా ఎదుర్కొనే వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించారు. మరోవైపు మోడీ ప్రభుత్వ సారథ్యంలో నక్సల్స్ చేపట్టిన హింసాత్మక ఘటనల సంఖ్య 43.4శాతం తగ్గిందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి.