కేంద్రమంత్రి అమిత్ షా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేసారు. బుధవారం గౌహతిలోని గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. గత రాత్రి అమిత్ షా అగర్తలా చేరుకోవాల్సి ఉంది. కానీ ప్రతికూల వాతావరణం కారణంగా ఆయన విమానం రాత్రి 10.45 గంటలకు గౌహతిలో ల్యాండ్ అయింది. రాత్రి గువాహటిలోని రాడిసన్ బ్లూ హోటల్‌లో షా బస చేశారు. ఈ ఉదయం ఆయన అగర్తల చేరుకున్నారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి రథయాత్రను ప్రారంభించనున్నారు.

గువాహటి విమానాశ్రయంలో అమిత్ షా విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. త్రిపుర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని అమిత్ షా నేడు ప్రారంభించనున్నారు. షెడ్యూల్ ప్రకారం కేంద్రమంత్రి గత రాత్రి అగర్తల చేరుకోవాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో వెనక్కి వచ్చిన విమానం రాత్రి 10.45 గంటల సమయంలో గువాహటిలో ల్యాండ్ అయ్యిందని తెలిపారు.

x