రేపు తెలంగాణకు రాబోతున్న అమిత్ షా..

కేంద్ర మంత్రి అమిత్ షా రేపు తెలంగాణ కు రాబోతున్నారు. బీజేపీ చీఫ్​ బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తూ.. గ్రామ గ్రామాలు తిరిగి టీఆర్​ఎస్​పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో రేపు ప్రజా సంగ్రామ యాత్రలో అమిత్ షా పాల్గొనబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ నోవాటెల్‌కు అమిత్ షా రానున్నారు. సాయంత్రం 6.30 గంటలకు తుక్కుగుడా సభాస్థలిలో జరగనున్న బండి సంజయ్​ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు హోంమంత్రి చేరుకుంటారు. రాత్రి 8.25 గంటలకు అమిత్ షా ఢిల్లీకి బయల్దేరి వెళతారు.

ఇక అమిత్ షా సభ ను భారీ సక్సెస్ చేయాలనీ బిజెపి నేతలు చుస్తునారు. రేపటి పర్యటనకు చాలా ప్రాధాన్యత ఉందని… రాష్ట్రంలో తండ్రికొడుకుల పాలన, కుటుంబ పాలనకు అమిత్ షా చరమగీరం పాడబోతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పాలన పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లు ఉందని విమర్శించారు. అమిత్‌ షా సభ సక్సెస్ చేసి.. కేసీఆర్ చెంప చెల్లుమనిపిస్తామని హెచ్చరించారు బీజేపీ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. అమిత్ షా సభ ఏర్పాట్లను పరిశీలించిన ఈటెల..అఞ్ఞతరం మీడియా తో మాట్లాడుడ్తూ.. కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారని ఆగ్రహించారు. కుట్రతో, కుటిల నీతితో పాలన కొనసాగిస్తున్నారని నిప్పులు చెరిగారు. ఈ అంశాలను ప్రజలకు వివరించేందుకు బండి సంజయ్ సంగ్రామ యాత్ర చేపట్టారని.. రేపు జరిగే సభను సక్సెస్ చేసి.. కెసిఆర్ చెంప ను చెల్లుమనిపిస్తామని హెచ్చరించారు.