సీఎం కేజ్రీవాల్‌ ఇచ్చిన హమీలు నెరవేర్చలేదు

రాజధాని పాఠశాలలో ఏ మార్పు రాలేదు కేజ్రీవాల్‌ జీ ?

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: డిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వాడివేడిగా సాగుతోంది. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌పై విమర్శలు చేశారు. కేజ్రీవాల్‌ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ అమిత్‌ షా ట్విట్టర్‌ ద్వారా ఓ వీడియో పోస్టు చేశారు. విద్యా విధానంలో విప్లవం తీసుకొస్తామంటూ కేజ్రీవాల్‌ గతంలో చెప్పారు. కానీ రాజధాని పాఠశాలలో ఏ మార్పు రాలేదని అమిత్‌ షా విమర్శించారు. ఈ ఆరోపణలకు ఢిల్లీ సీఎం తిప్పికొడుతూ కావాలంటే పాఠశాలలకు వెళ్లి చూసుకోవాలని సూచించారు. దీనికి సమధానంగా అమిత్‌ షా స్పందిస్తూ ఓ వీడియో పోస్టు చేశారు. దీనిలో అరవింద్‌ కేజ్రీవాల్‌ జీ మీరు ఢిల్లీ ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోన్న పాఠశాలలకు వెళ్లి చూడమన్నారు. నిన్న ఢిల్లీకి మా ఎనిమిది మంది ఎంపీలు పలు పాఠశాలలకు వెళ్లి అక్కడ పరిస్థితులను చూశారు. మీరు తీసుకొచ్చామన్న విద్యావిధానంలో విప్లవం బయటపడిందని ఎద్దేవా అమిత్‌ షా చేశారు. ఇప్పుడు ఢిల్లీ ప్రజలకు సమాధానం చెప్పండి అంటూ ఓ వీడియో పోస్టు చేశారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/