అమిత్ షా అధ్యక్షతన రాష్ట్ర హోం మంత్రుల సమావేశం

Amit Shah to meet state home ministers for ‘Chintin Shivir’ in Haryana

న్యూఢిల్లీ : శుక్రవారం నుంచి రెండ్రోజులపాటు కేంద్ర హోం మంత్రి అమిత్​షా అధ్యక్షతన హర్యానాలోని సూరజ్‌‌కుండ్‌‌లో చింతన్ శివిర్ జరగనుంది. ఈ సమావేశాల్లో అన్ని రాష్ట్రాల హోం మంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌‌ గవర్నర్లు పాల్గొంటారని, 6 సెషన్లలో వివిధ అంశాలపై చర్చిస్తారని హోంశాఖ వర్గాలు తెలిపాయి. రెండోరోజు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ఆన్​లైన్​ద్వారా సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని వెల్లడించాయి.

సైబర్ క్రైమ్ మేనేజ్​మెంట్, మహిళల సెక్యూరిటీ, డ్రగ్స్, నేర న్యాయ వ్యవస్థలో ఐటీ వినియోగం పెరుగుదల, కోస్టల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రతపై చర్చించనున్నారు. ఈ అంశాలపై కేంద్ర రాష్ట్రాల మధ్య సమన్వయాన్ని సులభతరం చేయడం, మెరుగైన జాతీయ విధానం రూపకల్పన లక్ష్యంగా సమావేశాలు జరగనున్నాయి.