ప్రభాస్ ను కలవబోతున్న కేంద్ర మంత్రి అమిత్ షా

కేంద్ర మంత్రి అమిత్ షా..ఈ నెల 16 న కృష్ణం రాజు కుటుంబ సభ్యులను కలవబోతున్నారు. రీసెంట్ గా అనారోగ్యంతో కృష్ణం రాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. కృష్ణం రాజు మరణం యావత్ సినీ అభిమానులనే కాదు రాజకీయ ప్రముఖులను సైతం దిగ్బ్రాంతికి గురి చేసింది. కడసారి కృష్ణం రాజు ను చూసేందుకు పోటీ పడ్డారు. ఇప్పటికే పలు సంతాప సభలు ఏర్పటు చేసి ఆయనకు నివాళ్లు అర్పించడం జరిగింది. ఇక ఈ నెల 16 న కేంద్రమంత్రి అమిత్ షా..కృష్ణం రాజు కుటుంబ సభ్యులను కలవబోతున్నారు.

కృష్ణంరాజు సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు. వాజ్‌పేయి హయాంలో కేంద్రంమంత్రిగా పనిచేశారు. పలువురు బీజేపీ అగ్రనేతలతో కృష్ణంరాజుకు సాన్నిహిత్యం ఉంది. సహాయ మంత్రి హోదాలో ఆయన రక్షణ మంత్రిత్వశాఖలోను పని చేశారు. ఈ క్రమంలో బీజేపీ అగ్రనేతలు కృష్ణంరాజు కుటుంబసభ్యులను, హీరో ప్రభాస్‌ను పరామర్శించనున్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, హీరో ప్రభాస్‌తో భేటీ కానున్నారు. దీంతోపాటు రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

తెలంగాణ విమోచన వజ్రోత్సవ వేడుకలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ నెల 16వ తేదీన ఆయన హైదరాబాదుకు చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం దివంగత సినీ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అవుతారు. 17వ తేదీ ఉదయం విమోచన వజ్రోత్సవాలకు హాజరవుతారు. పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు.