నాకేం కాలేదు పూర్తి ఆరోగ్యంతో ఉన్నా

పూర్తి అంకితభావంతో విధులు నిర్వర్తిస్తున్నానన్న అమిత్ షా

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోగ్యం పట్ల వస్తున్న వదంతులను ఆయన కొట్టిపారేశారు. తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, తాను ఎలాంటి జబ్బుతో బాధపడడంలేదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రిగా తన విధులను సంపూర్ణ అంకితభావంతో నిర్వర్తిస్తున్నానని తెలిపారు. కాగా ఈ పుకార్లపై నేను దృష్టి సారించలేదు. అయితే అర్ధరాత్రి ఈ విషయం నా దృష్టికి వచ్చింది. ప్రజలందరూ తమ తమ ఊహల్లో విహరిస్తూ ఉంటారని భావించాను. అందుకే ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు. కానీ… గత రెండు రోజులుగా కోట్లాది మంది పార్టీ కార్యకర్తలు, శ్రేయాభిలాషులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆందోళనను పరిగణలోకి తీసుకోకుండా ఉండలేకపోయా. అందుకే నేను ఈ రోజు ఓ స్పష్టతనిస్తున్నా. నేను సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉన్నా. ఏ వ్యాధితోనూ బాధపడటం లేదు అని ట్విట్టర్ వేదికగా అమిత్‌షా వివరణ ఇచ్చారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/