పోలీసుల స్మారకానికి శ్రద్ధాంజలి ఘటించిన అమిత్‌షా

Amit Shah pays tribute at National Police Memorial

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఢిల్లీలోని పోలీసుల స్మారకాగనికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశ భద్రత కోసం పోలీసులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగం వల్లే నేడు దేశం అభివృద్ధి వైపు పయనిస్తోందని కొనియాడారు. దేశం మొత్తం పండుగలు చేసుకుంటూ… ఆనందంగా ఉంటే.. పోలీసులు మాత్రం తమ విధులను నిర్వర్తిస్తుంటారని ప్రశంసించారు. ఈ సంవత్సరం 260 మంది పోలీసులు అమరులయ్యారని, ఈ స్మారక చిహ్నం ద్వారా పోలీసుల త్యాగం గురించి కొత్త తరం తెలుసుకుంటుందని అన్నారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో పోలీసుల పాత్ర చాలా ముఖ్యమైందని, చాలా అద్భుతంగా సేవలందించారని ఆయన ప్రశంసించారు. లాక్‌డౌన్ సమయంలో విధులు నిర్వర్తిస్తూ… 343 మంది పోలీసులు తమ ప్రాణాలను కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. పోలీసులు దేశ రక్షణను చూసుకోవాలని, వారి కుటుంబాల యోగక్షేమాలను ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకుంటుందని షా భరోసా కల్పించారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/