పివోకే కూడా జమ్ముకశ్మీర్‌లో భాగమే

జమ్ముకశ్మీర్‌ పునర్విభజనపై లోక్‌సభలో చర్చ

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఈరోజు లోక్ సభలో జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా తనను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పై మండిపడుతూ, అమిత్ షా ఉద్వేగ పూరిత ప్రసంగాన్ని చేశారు. కాశ్మీర్ లో ప్రజలు దశాబ్దాల తరబడి అన్యాయానికి గురవుతుంటే, ఎన్నో ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ వారిని పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. కాశ్మీర్ లో ఉద్రిక్తతలకు కారణం కాంగ్రెస్ వైఖరేనని మండిపడ్డారు.

ఇప్పటికే రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందిందని, రాష్ట్రపతి సైతం బిల్లు పట్ల సానుకూల వైఖరితోనే ఉన్నారని, లోక్ సభలో బిల్లు ఆమోదం పొందేందుకు విపక్ష పార్టీలు సహకరిస్తే, ప్రజలు హర్షిస్తారని అన్నారు. ఈ బిల్లు అమలైతే కాశ్మీర్ వాసులకు ఎన్నో ప్రయోజనాలు దగ్గరవుతాయని అమిత్ షా గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ అంశంతో ఇతర దేశాలకు, ముఖ్యంగా పాకిస్థాన్ కు ఏ మాత్రం సంబంధం లేదని, ప్రస్తుతం పాకిస్థాన్ ఆక్రమిత ప్రాంతంగా ఉన్న కాశ్మీర్ సైతం భారత్ లో అంతర్భాగమేనని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఆ ప్రాంతం నుంచి వైదొలగాలని హితవు పలికారు.
పీవోకే కూడా జమ్ముకశ్మీర్‌లో భాగమేనని తేల్చిచెప్పారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/