నిరసన ఆపాలి..వైద్యులకు అమిత్‌షా భరోసా

వైద్యులపై దాడులు..నేడు వైద్యుల వైట్‌ అలర్ట్ …రేపు బ్లాక్‌ డే

Amit Shah assures IMA of full support by govt
Amit Shah assures IMA of full support by govt

న్యూఢిల్లీ: దేశంలో కరోనా నేపథ్యంలో సేవలు అందిస్తున్న వైద్యులపై పలు చోట్ల కొందరు దాడులకు పాల్పడుతున్నారు. దీంతో వైద్యులు ఈ రోజు నిరసనకు దిగారు. ఈసందర్భంగా వైద్యులు దేశవ్యాప్తంగా రేపు బ్లాక్‌డే పాటించాల‌ని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ (ఐఎంఏ) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ రోజు రాత్రి 9 గంటలకు ఆసుపత్రుల్లో క్యాండిల్స్‌ వెలిగించి నిరసన తెలపనున్నారు. దీనికి వైట్‌ అలర్ట్ అని పేరు పెట్టారు. దీంతో ఈ రోజు ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులతో హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో కృషి చేస్తున్న వైద్యుల బృందానికి అమిత్ షా అభినందనలు తెలిపారు. వైద్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని అమిత్ షా భరోసా ఇచ్చినట్లు హోం శాఖ వర్గాలు పేర్కొన్నాయి. వైద్య సిబ్బందికి రక్షణ కల్పించనున్నట్లు అమిత్ షా హామీ ఇచ్చినట్లు తెలిపింది. నిరసన కార్యక్రమాలు ఆపాలని వైద్యులకు అమిత్ షా సూచించారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/