ఇరువురు సిఎంలకు అమిత్‌షా భరోసా

తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుంది

Amit Shah
Amit Shah

న్యూఢిల్లీ: అంప్‌న్‌ తుపాన్‌ బెంగాల్‌, ఒడిశా తీరం వెంబడి దూసుకోస్తుంది.ఈ నేపథ్యంలో సదరు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఫోన్ ద్వారా పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, ఒడిశా సిఎం నవీన్‌ పట్నాయక్‌లతో మాట్లాడారు. తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉందని ఇరువురు ముఖ్యమంత్రులకు భరోసా ఇచ్చారు. కేటగిరీ 5 హరికేన్ తో సమానమైన అంప్‌న్‌ అంతకంతకూ బలపడుతోంది. రేపు అది తీరాన్ని దాటబోతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని 50 లక్షలకు పైగా జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/