‘జాతీయ సహకార సదస్సు’లో అమిత్ షా ప్రసంగం

Shri Amit Shah addresses the ‘National Cooperative Conference’ in New Delhi.

న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జాతీయ స‌హ‌కార స‌ద‌స్సును ఉద్దేశించి హోం, స‌హ‌కార శాఖ మంత్రి అమిత్ షా ప్ర‌సంగించారు. ఈసందర్బంగా ఆయన మాట్లడుతూ..కేంద్ర ప్ర‌భుత్వం త్వ‌ర‌లో నూత‌న స‌హ‌కార విధానాన్ని ప్ర‌క‌టిస్తుంద‌ని వెల్ల‌డించారు. దేశ అభివృద్ధిలో స‌హ‌కార మంత్రిత్వ శాఖ అద్భుత సామ‌ర్ధ్యంతో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని అన్నారు.

ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌ల వేళ నూత‌న స‌హ‌కార విధానాన్ని తీసుకువ‌స్తున్నామ‌ని ఇది గ్రామీణ స‌మాజాన్ని బ‌లోపేతం చేస్తుంద‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఈరోజు దేశంలో 91 శాతం గ్రామాల్లో స‌హ‌కార సంస్ధ‌లు ప‌నిచేస్తున్నాయ‌ని చెప్పారు. దేశ ఆర్ధిక వ్య‌వ‌స్థ 5 ల‌క్ష‌ల కోట్ల డాల‌ర్ల‌కు ఎదిగేందుకు స‌హ‌కార వ్య‌వ‌స్థ కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/