కాంగ్రెస్ కంచుకోట‌ అమేఠీలో క‌మ‌లం పాగా

smruti iarani
smruti iarani


న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కంచుకోట అమేఠీలో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఓడించి సంచలనం సృష్టించారు కేంద్రమంత్రి, బిజెపి నేత స్మృతి ఇరానీ. ఈ సందర్భంగా ఓట్లు వేసి తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘అమేఠీకి నవోదయం.. సరికొత్త సంకల్పం.. మా అభివృద్ధి పనులపై విశ్వాసం ఉంచి కమలాన్ని వికసింపజేశారు. అందుకు అమేఠీ ప్రజలకు ధన్యవాదాలు’ అని స్మృతి ట్విటర్‌ ద్వారా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.  

అమేఠీ నియోజకవర్గం కాంగ్రెస్‌కు కంచుకోట లాంటిది. నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఒకటి, రెండు సార్లు మినహా ఇక్కడ కాంగ్రెసే ప్రాతినిధ్యం వహిస్తోంది. 55వేల ఓట్లకు పైగా ఆధిక్యంతో స్మృతి.. రాహుల్‌పై విజయం సాధించి కాంగ్రెస్‌ కంచుకోటను బద్ధలు కొట్టారు. దీంతో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో కాంగ్రెస్‌ కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. రాయ్‌బరేలీలో సోనియాగాంధీ విజయం సాధించగలిగారు. 

తాజా బిజినెస్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/news/business/