హత్యకు గురైన బిజెపి కార్యకర్త

Surendra Singh
Surendra Singh

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అమెఠీ నియోజకవర్గంలోని బరౌలియా గ్రామంలోని గ్రామ మాజీ సర్పంచ్‌, బిజెపి క్రీయాశీల కార్యకర్త శనివారం రాత్రి హత్యకు గురయ్యాడు. అయితే గడిచిన రాత్రి సురేంద్ర సింగ్‌ అనే బీజేపీ కార్యకర్తపై కొందరు దుండగులు ఈ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. పాత గొడవలు గానీ, రాజకీయ తగాదాలు గానీ హత్యకు కారణమై ఉండొచ్చని అమేథి ఎస్పీ రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా స్మృతి ఇరానీ ఇతడి సేవలు మెచ్చుకుంటూ పలుమార్లు బహిరంగ సభల్లో ప్రస్తావించారు.


తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/