చైనాకు అమెరికా వార్నింగ్‌!

China, US
China, US

వాషింగ్టన్‌: మరికాసేపట్లో ఐక్య రాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కానుంది. ఈసందర్భంగా జైషే మహ్మద్‌ చీఫ్‌ మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ ఉద్రవాదిగా గుర్తించే ప్రతిపాదనపై చర్చించనుంది. అయితే ఈసందర్భంగా మరోసారి ఈ ప్రతిపాదనను అడ్డుకోవాలని చూస్తున్న చైనాకు అమెరికా వార్నింగ్‌ ఇచ్చింది. జైషేను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించేందుకు అన్ని విధాలుగా అర్హుడని, ఈ ఉగ్రవాదుల జాబితాను అప్‌డేట్ చేయకుండా చైనా అడ్డుపడటం అమెరికాతోపాటు ఆ దేశ ప్రయోజనాలకు కూడా విరుద్ధమేనని అమెరికా విదేశాంగ ప్రతినిధి రాబర్ట్ పాలాడినో అన్నారు. కీలక సమావేశానికి ముందు అమెరికా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా గుర్తించాలన్న ప్రతిపాదనను ఈసారి అమెరికాతోపాటు ఫ్రాన్స్, యూకే దేశాలు యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ ముందుకు తీసుకొచ్చాయి. ఇప్పటికే ఈ అంశంపై మూడుసార్లు చర్చలు జరగగా.. ప్రతిసారీ చైనా అడ్డుపడింది. ఈసారి కూడా డ్రాగన్ అడ్డుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అజర్.. జైషే ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడని, అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి ఇంతకన్నా ఇంకేం కావాలని రాబర్టో అన్నారు. అయితే ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోని ఆంక్షల కమిటీ సమావేశంలో జరగబోయే చర్చల గురించి మాత్రం చెప్పడానికి ఆయన నిరాకరించారు. కానీ కచ్చితంగా ఈ జాబితాలో మసూద్ అజర్‌ను చేర్చేందుకు కృషి చేస్తామని మాత్రం స్పష్టం చేశారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/