ప్రధాని మోడీకి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు

మోడీ తరపున స్వీకరించిన అమెరికాలో భారత రాయబారి చరణ్‌జిత్‌ సింగ్‌

Indian Ambassador to the US Charanjit Singh
Indian Ambassador to the US Charanjit Singh receiving the prestigious Legion of Merit from US Defense Adviser Robert O’Brien on behalf of Prime Minister Modi.


Washington: భారత్‌-అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో విశేష కృషి చేసారని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిష్టాత్మక ‘లీజియన్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డును ప్రకటించారు.

మోడీతో పాటు జపాన్‌ ప్రధాని షింజో అబె, ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌లకు కూడా ట్రంప్‌ ఈ అవార్డును ప్రకటించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయం గా అమెరికా, ఇండియా, జపాన్‌, ఆస్ట్రేలియాలు కలిసి ‘క్వాడ్‌ గ్రూపుగా ఏర్పడ్డ నేపథ్యంలో అమె రికా ఈ అవార్డులను ఆయా ప్రభుత్వాధి నేతలకు ఇవ్వడం గమనార్హం.

”అమెరికా-భారత్‌ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో చూపించిన నాయకత్వ పటిమకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ లీజియన్‌ ఆఫ్‌ మెరి ట్‌ని అందించారని అమెరికా జాతీయ భద్రతా సలహా దారు రాబర్ట్‌ ఒబ్రీన్‌ ట్వీట్‌ చేశారు.

ఇక భారత విదేశాంగశాఖ కూడా ఈ విషయాన్నే తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా అత్యున్నత సైనిక పురస్కారం ది లీజి యన్‌ ఆఫ్‌ మెరిట్‌, డిగ్రీ చీఫ్‌ కమాండర్‌ని భారత ప్రధానమంత్రికి 2020 డిసెంబరు 21వ తేదీ అమెరికా అధ్యక్షుడు ప్రదానం చేశారు.

భారతదేశం ప్రపంచ శక్తిగా ఎదగడంలో చూపించిన ముందుచూపుకి,నాయకత్వానికి, భారత-అమెరి కా వ్యూహా త్మక భాగస్వామ్యం అభివృద్ధికి చేసిన అసమానసేవకు,ప్రపంచశాంతి, ఉన్నతికి ఆయన చేసినకృషికి అవార్డు ఇచ్చినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

అమెరికాలో భారత రాయబారి తరణ్‌ జిత్‌ సింగ్‌ సంధూ ప్రధానమంత్రి తరఫున వైట్‌ హౌస్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అమెరికా రక్షణ సలహాదారు రాబర్ట్‌ ఒబ్రీన్‌ నుంచి ఈ అవార్డును స్వీకరించారు.

అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డి రూజ్వెల్ట్‌ 1942లో ఈ అవార్డును అమెరికా సైనిక దళాల్లో ను, విదేశీ సైనికదళాల్లో అత్యున్నత సేవలు చేసినవారికి, విదేశీ ప్రభుత్వాలకు, దేశాధినేతలకు ఇచ్చేందుకు ప్రవేశపెట్టారు. భారతదేశం నుంచి ఈ అవార్డును ఇప్పటి వరకు పొందిన ఏకైక వ్యక్తి ఫీల్డ్‌ మార్షల్‌ కెఎమ్‌ కరియప్ప.ఈయనకు 1949లో ట్రూమన్‌ అమెరికా అధ్యక్షునిగా ఉన్న ప్పుడు ప్రదానం చేశారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/