ముఖ్యాంశాలు

పౌరులు బహిరంగంగా తుపాకులు కలిగి ఉండడం వారి హక్కు : అమెరికా సుప్రీంకోర్టు

తుపాకి సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా చట్టం తీసుకొచ్చే పనిలో బైడెన్ సర్కారు.. అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు

Americans Have Right To Carry Guns In Public: US Supreme court

న్యూయార్క్ : ఇటీవల అమెరికాలో తుపాకుల కాల్పులతో మోతెక్కిపోయింది. పలు రాష్ట్రాల్లో జరిగిన ఘటనల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అమెరికా తుపాకి సంస్కృతిపై చర్చ మొదలైంది. తుపాకులను నిషేధించాలన్న డిమాండ్ కూడా వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ దేశ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మరోమారు చర్చనీయాంశమైంది. బహిరంగంగా తుపాకులు కలిగి ఉండడం అమెరికన్ల హక్కని కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

6-3 మెజారిటీతో న్యాయమూర్తులు ఈ తీర్పును వెలువరించారు. న్యూయార్క్, లాస్‌ఏంజెలెస్, బోస్టన్ తదితర పెద్ద నగరాలు సహా అన్ని ప్రాంతాల్లోనూ పౌరులు తమ వెంట తుపాకులు తీసుకెళ్లొచ్చని, వ్యక్తిగత రక్షణకు బహిరంగంగా తుపాకి కలిగి ఉండడం ఓ వ్యక్తి హక్కు అని జస్టిస్ క్లారెన్స్ థామస్ తన తీర్పులో రాసుకొచ్చారు. ఈ సందర్భంగా న్యూయార్క్ గతంలో చేసిన చట్టాన్ని కోర్టు కొట్టివేసింది. తుపాకి సంస్కృతికి అడ్డుకట్ట వేసేలా ఓ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్న బైడెన్ సర్కారు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందన్న ఆసక్తి మొదలైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/

Suma Latha

Recent Posts

అస్సాంకు ముకేశ్ అంబానీ రూ. 25 కోట్ల సాయం

భారీ వరదలతో అస్సాం రాష్ట్రం అతలాకుతమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ , ఆయన…

7 hours ago

లోకేష్ కు..శుభ కార్యానికి, పరామర్శకు అర్థం తెలియదంటూ ఎమ్మెల్యే పిన్నెలి ఫైర్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫై వైస్సార్సీపీ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఓ రేంజ్ లో…

7 hours ago

బండ్ల ఇంటికి రేవంత్ రెడ్డి..కారణం ఏంటి..?

బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ ఇంటికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెళ్లడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చ గా…

7 hours ago

మళ్లీ మారిన ‘థాంక్యూ’ విడుదల తేదీ..

నాగ చైతన్య - మనం ఫేమ్ విక్రమ్ కె కుమార్ కలయికలో రాబోతున్న థాంక్యూ మూవీ మరోసారి రిలీజ్ డేట్…

7 hours ago

పద్ధతి మార్చుకోవాలంటూ వైస్సార్సీపీ నేతలకు పవన్ వార్నింగ్..

వైస్సార్సీపీ నేతలకు వారి అనుచరులకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి…

7 hours ago

కొలంబియా యూనివర్సిటీని సందర్శించిన జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం న్యూయర్క్‌ కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంలో…

7 hours ago