ముదిరిన అమెరికా-చైనాల వ్యవహారం

చెంగ్డూ కాన్సుల్‌పై అమెరికా జెండా దించేసిన చైనా

American flag lowered at US consulate in Chengdu

బీజింగ్‌: అమెరికా-చైనాల వ్యవహారం రోజురోజుకీ ముదురుతోంది. తాజాగా చెంగ్డూ యూఎస్‌ కాన్సులేట్‌‌పై అమెరికా జెండాను చైనా దించివేసింది. అదేవిధంగా రాయ‌బార కార్యాల‌యం అని సూచించే బోర్డును ఓ వ్య‌క్తి తొల‌గిస్తున్న దృష్యాల‌ను ఆ దేశ అధికార మీడియా సీసీటీవీ ప్ర‌సారం చేసింది. కార్యాల‌య్యాన్ని ఖాళీ చేయించే ప‌నుల‌ను ముమ్మ‌రంగా చేప‌డుతున్న‌ది. ఆర్థికంగా సుసంప‌న్న దేశాలైన అమెరికా, చైనా మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం న‌డుస్తున్న‌ది. ఒక దేశంపై మ‌రో దేశం ఆంక్ష‌లు విధిస్తుండ‌టంతో అగ్ర‌రాజ్యాల సంబంధాలు మ‌రింత దిగ‌జారాయి. హ్యూస్ట‌న్‌లోని చైనా రాయ‌బార కార్యాల‌యాన్ని ఖాళీచేయాల‌ని అమెరికా ప్ర‌క‌టించిన 72 గంట‌ల్లోనే బీజింగ్ ప్ర‌తిచ‌ర్య‌కు దిగింది. చెంగ్డూలోని యూస్ రాయ‌బార కార్యాల‌య లైసెన్సును మూడు రోజుల క్రితం చైనా ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/