పాకిస్థాన్‌కు అమెరికా హెచ్చరిక

Mike Pompio
Mike Pompio

వాషింగ్టన్‌: పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్‌ నిన్న తెల్లవారుజూమున జైషే ఉగ్రస్థావరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదం పై గట్టి చర్యలు తీసుకోవాలంటూ అగ్రరాజ్యం అమెరి పాకిస్థాన్‌ హెచ్చరించింది. కాగా సరిహద్దు వెంట నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. తొందరపాటు చర్యలకు పాల్పడొద్దంటూ యూఎస్‌ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో ఓ ప్రకటనలో తెలిపారు. ఇరు దేశాల విదేశాంగ మంత్రులతో మాట్లాడానన్నారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించానన్నారు. ఇక ముందర ఎలాంటి సైనిక చర్యకు పాల్పడొద్దని కోరినట్లు తెలిపారు.