అమెరికాలో లాక్‌డౌన్‌ సడలింపు రాష్ట్రాలు

భౌతిక దూరం నిబంధన పాటించాలని సూచన

america
america

అమెరికా: అమెరికాలో పలు రాష్ట్ర లాక్‍డౌన్‍ నిబంధనలను సడలించే పనిలో పడ్డాయి. మరో వైపు ఆచితూచి అడుగు వేయాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. జార్జియా రాష్ట్రంలో శుక్రవారం నుండి జిమ్‍లు, హెయిర్‍ సెలూన్‍ వంటి చిరు వ్యాపారాలను పున ప్రారంభించేందుకు అనుమతిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్‍ బ్రియాన్‍ కెంప్‍ ప్రకటించారు. వ్యాపారాలు పునరుద్ధరించినా, భౌతిక దూరం నిబంధన పాటించాలని ఆయన సూచించారు. జార్జియా బాటలోనే సౌత్‍ కరోలినా, టెన్నస్సీ, ఇలినాయిస్‍, లూసియానా రాష్ట్రాలు లాక్‍డౌన్‍ను సడలిస్తున్నాయి.

న్యూజెర్సీ గవర్నర్‍ ఫిల్‍ మర్ఫీ ఇందుకు విముఖత వ్యక్తం చేశారు. వ్యాపారాలు పున ప్రారంభమైతే రాష్ట్రం అత్యంత జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సి వుంటుందన్నారు. కరోనా మహమ్మారి అత్యంత వేగంగా దేశాన్ని కమ్ము కుంటున్న నేపథ్యంలో ఆయ రాష్ట్రాలు లాక్‍డౌన్‍ల సడలింపునకు సిద్దం కావటంపై వైట్‍హౌస్‍ వైద్యాధికారి డా.ఆంథోని ఫౌసి లాక్‍డౌన్‍ల తొలగింపు విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. తొందరపాటుతో వ్యవహరిస్తే ఎదురు తిరిగే ప్రమాదం వుందని హెచ్చరించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/