ఎనిమిది చెనా సంస్థలపై అమెరికా వేటు!

నిషేధిత జాబితాలోచేర్చినట్లు ప్రకటన

bharat-china
china-America

న్యూఢిల్లీ: అమెరికా చైనాలమధ్యనడుస్తున్న ట్రేడ్‌వార్‌ నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఆంక్షలు మరింతగాపెరుగుతున్నాయి. తాజాగా అమెరికా ఎనిమిది చైనా సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చింది. ఈ చర్యలవల్ల సరఫరాదారులు, కస్టమర్లు, ఆర్ధికమద్దతు దారులకు సైతం నష్టాలు వాటిల్లుతాయని ఆర్థిక మార్కెటింగ్‌ నిపుణులు పేర్కొంటున్నారు. చైనాకు చెందిన అత్యున్నతస్థాయి సంస్థలు కృత్రిమమేధకు సంబంధించి స్టార్టప్‌లను బ్లాక్‌లిస్టులోపెట్టింది. ముస్లిం మైనార్టీలపై బీజింగ్‌ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఈ చర్యలను చేపట్టినట్లు ప్రకటించింది. వీటినుంచి అమెరికా కంపెనీలు కొనుగోలుకానీ, అమెరికా కంపెనీలు వీటికి విక్రయించడం కానీ చేయకూడదు. ఈ చర్య కేవలం కంపెనీలకే కాకుండా వాటి సరఫరాదారులు, కస్టమర్లు, ఆర్ధికంగా బాసటనిచ్చే సంస్థలు వ్యక్తులకు సైతం అన్వయించారు. హికివిజన్‌ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద నిఘా వీడియో వ్యవస్థల్లో అగ్రగామిగా ఉంది. పోలీస్‌ ఏజెన్సీలు గ్జిన్‌జియాంగ్‌ వంటి వాటికి సరపఱాచేస్తోంది.

ఉ§్‌ుఘర్స్‌కు సంబంధించి అంతర్జాతీయంగా నలుగుతున్న సమస్యకు అమెరికాసైతం బీజింగ్‌పై చర్యలకు ముందుకువచ్చింది. ఇకపై హికివిజన్‌ను అమెరికా ప్రభుత్వ ఏజెన్సీల్లోనికి అనుమతించడంలేదు. ఆగస్టు మధ్యస్తంనుంచే ఈ చర్యలు తీసుకుంది. ఇపుడు మరోఐదు సంస్థలను భద్రతా కారణాలరీత్యా వాటి ఉత్పత్తులనుసైతం బ్లాక్‌చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీఎఇ 42 బిలియన్‌ డాలర్ల విలువైన మార్కెట్‌ టర్నోవర్‌ ఉంది. చైనా ఇన్వెస్టర్లు, ఇద్దరు కీలక వ్యవస్థాపకుల ఆధ్వర్యంలో నడుస్తోంది. 50 బిలియన్‌ డాలర్ల యువాన్లలో 30శాతం వాటా సాలీనా విదేశాలనుంచే రాబడిరూపంలో వస్తోంది. అంటే 700 కోట్ల డాలర్లు విదేశాలనుంచే రాబడుతోంది. హికివిజన్‌ మాత్రం తమ సఱఫరాదారులను స్పష్టంచేయలేదు.జపాన్‌ వీడియో ఇంటర్‌ఫేస్‌సంస్థ టెక్‌పాయింట్‌ ఇంక్‌ మార్చినెలలో స్టాక్‌ ఎక్ఛేంజిలకు నివేదిక ఇస్తూ హికివిజన్‌ తమరాబడుల్లో 62శాతం వాటాతో ఉందని వెల్లడించింది. హికివిజన్‌తో బిజినెస్‌ నష్టం వల్ల మొత్తం వ్యాపారంపైనే ప్రభావంచూపిస్తుందని అంచనా. హికివిజన్‌, దహువా రెండుసంస్థలు ఇంటెల్‌కార్ప్‌, నివిడా కార్ప్‌, యాంబరెల్లా ఇంక్‌, వెస్ట్రన్‌ డిజిటల్‌ , సీగేట్‌ టెక్నాలజీ సరఫరాదారులుగా వెల్లడించింది. ఈ చైనా కంపెనీలను ఇపుడు బ్లాక్‌చేస్తే బిజినెస్‌ మొత్తం దెబ్బతింటుందని అంచనా. సెన్స్‌టైమ్‌గ్రూప్‌ కూడా జాబితాలోచేరింది.

ఐడిజి కేపిటల్‌ అధ్వర్యంలో చైనాలోనే కృత్రిమమేధకు సంబంధించి అత్యవవేగంగా వృద్ధిచెందుతున్న స్టార్టప్‌గా నిలిచింది. బీజింగ్‌, హాంకాంగ్‌ కేంద్రంగా ఉన్న ఈకంపెనీ ముఖకవళికల గుర్తింపు, వీడియో విశ్లేషణ,స్వతంప్రతిపత్తి డ్రైవింగ్‌ వంటివాటికి సేవలందిస్తోంది. ఎయిర్‌ఫోర్టులు ఇతర కీలక విబాగాలకు సేవలం కీలకంగా నిలిచాయి. కెమేరాలసాయంతో వీటిని వివ్లేషిస్తుంది. బహిరంగప్రదేశాల్లో అనుమానితులపై వేటువేస్తుంది. 620 మిలియన్‌ డాలర్ల నిధుల సమీకరణ గత ఏడాది మేనెలలోపూర్తిచేసింది. ఫిడిలిటీ ఇంటర్నేషనల్‌, హోపు కేపిటల్‌, సిల్వర్‌లేక్‌, టైగర్‌గ్లోబల్‌ సంస్థలు నిధులు అందచేసాయి. ముఖకవళికల గుర్తింపు, అన్‌లాక్‌ వ్యవస్థలను ఒప్పొ, వివో వంటి మొబైల్‌సంస్థలకు అందచేసింది.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/business/