ఆఫ్గనిస్తాన్‌లో అమెరికా సైన్యం కొన్ని వేలు కోట్లు వదిలివెళ్లారు

ఆఫ్గనిస్తాన్‌ ను దాదాపు 20 ఏళ్లు పాలించిన అమెరికా సైన్యం..ఇప్పుడు మళ్లీ తాలిబన్ల చేతిలో పెట్టి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌ అంత కూడా భయానిక వాతావరణంలో ఉంది. అయితే అమెరికా సైన్యం వెళ్తూ వెళ్తూ ఆప్ఘన్ లో వేల కోట్ల ఆయుధ సంపత్తినంతా అక్కడే వదిలినట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఆయుధ సంపత్తినంతా తాలిబన్లు సొంతం చేసుకున్నారు.

అమెరికా సైన్యం వదిలిన ఆయుధలు చూస్తే..

 • తాలిబాన్లు ప్రస్తుతం M113A2 వంటి వ్యక్తిగత క్యారియర్‌లను కలిగి ఉన్నారు. ఒక్కో క్యారియర్‌కు 1,70,000 డాలర్లు ఖర్చు అవుతుంది.
 • 4,12,000 నుండి 7,67,000 డాలర్ల వరకు ఖరీదు చేసే రెస్క్యూ వాహనాలు కూడా ప్రస్తుతం తాలిబాన్ల ఆధీనంలో ఉన్నాయి.
 • 1,04,682 డాలర్ల ధర కలిగిన ఒక హమ్వీ, యుటిలిటీ హమ్వీ($ 91,429) ప్రస్తుతం తాలిబాన్ల వద్ద ఉంది.
 • బ్లాక్ హాక్ హెలికాప్టర్ ధర 21 మిలియన్ల డాలర్లు.
 • 2013 లో యుఎస్ 20 A-29 సూపర్ టుకానో ఫైటర్ జెట్లను కొనుగోలు చేసింది. వీటి ధర 427 మిలియన్ల డాలర్లు. ఒక విమానం ధర 21.3 మిలియన్ల డాలర్లు.
 • 2018 మార్చిలో, ఆఫ్గన్ ఎయిర్ ఫోర్స్ సి -208 లైట్ ఎటాక్ ఎయిర్‌క్రాఫ్ట్ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఏడు విమానాలకు 84.6 మిలియన్ డాలర్లు. దీనికి హెలిఫైర్ క్షిపణి, ట్యాంక్ నిరోధక క్షిపణి, ఇతర ఆయుధాలు అమర్చబడ్డాయి.

అలాగే ..1. హుమ్వి – 2,21,74

 1. M1117 – 634
 2. MxxPro మైన్ ప్రూఫ్ వాహనాలు – 155
 3. M113 – 169
 4. పికప్ ట్రక్కులు మరియు SUV లు – 42,000
 5. మెషిన్ గన్స్ – 64,363
 6. ట్రక్కులు – 8,000
 7. రేడియో – 1,62,043
 8. నైట్ విజన్ గాగుల్స్ – 16,035
 9. అటాక్ రైఫిల్స్ – 3,58,530
 10. తుపాకులు – 1,26,295
 11. ఆర్టిలరీ పీసెస్ – 176

ఓవరాల్ గా తాలిబన్ల వద్ద ప్రస్తుతం 75 వేల వాహనాలు, 200 లక పైగా విమానాలు, హెలికాప్టర్లు, 6 లక్షల చిన్న, తేలికపాటి ఆయుధాలు ఉన్నాయని అమెరికా రాజకీయ నిపుణులు చెప్పుకొచ్చారు.