కరోనా రెండో సారి వస్తే..అమెరికా వైద్యులు

వారిలో తీవ్ర లక్షణాలు కనిపిస్తాయని వెల్లడించిన అమెరికా వైద్యులు

Corona outbreak in 2021-AIIMS
Corona

అమెరికా: కరోనా వైరస్‌ ప్రపంచదేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ గురించి అమెరికా వైద్యులు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కరోనా వైరస్ ఒకసారి నయమైన తర్వాత మళ్లీ సోకే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఒకసారి వచ్చిన మళ్లీ రాదన్న భరోసా ఏమీలేదని వారు స్పష్టం చేశారు. పైగా, మొదటిసారితో పోల్చితే రెండోసారి వైరస్ సోకినప్పుడు తీవ్రమైన లక్షణాలకు గురవుతారని వివరించారు. నెవాడాకు చెందిన ఓ వ్యక్తి రెండు సార్లు కరోనా వైరస్ బారినపడ్డాడని, 48 రోజుల వ్యవధిలో ఆ వ్యక్తి మరోసారి కరోనాబారినపడ్డాడని అమెరికా వైద్యులు వివరించారు. దాంతో ఆ వ్యక్తి తీవ్రస్థాయిలో శ్వాస సంబంధ సమస్యలకు గురికాగా, ఆక్సిజన్ సాయం అందించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు ప్రముఖ వైద్య పరిశోధన పత్రిక లాన్సెట్ జర్నల్ లో పరిశోధనాత్మక వివరాలు ప్రచురించారు. రెండుసార్లు కరోనా వచ్చిన కేసులు అమెరికాలోనే కాకుండా హాంకాంగ్, ఈక్వెడార్, బెల్జియం, నెదర్లాండ్స్ దేశాల్లోనూ వచ్చాయని లాన్సెట్ జర్నల్ లో పేర్కొన్నారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/