విదేశీ ప్రయాణికులపై నిషేధం ఎత్తివేసిన అమెరికా

వాషింగ్టన్‌ : విదేశీ ప్రయాణికులపై ఉన్న నిషేధాన్ని సోమవారం నుంచి అమెరికా ఎత్తివేసింది. 21 నెలల తర్వాత అంతర్జాతీయ ప్రయాణికులపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేసిన అమెరికా.. కొవిడ్‌ టీకాలు వేసిన వారికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్లు పేర్కొన్నది. మరో వైపు కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వారిని సైతం అనుమతించనున్నట్లు పేర్కొన్నది. కొవిడ్‌ ఆంక్షల కారణంగా అమెరికాలో నివసిస్తున్న చాలా మంది భారతీయులు దేశంలోనే చిక్కుకుపోయారు.

2020లో అప్పటి అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ నిషేధాన్ని విధించగా.. తర్వాత జోబైడెన్‌ నిషేధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ప్రస్తుతం కొవిడ్‌ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో ఆంక్షలను సండలించింది. అయితే, యూఎస్‌కు వెళ్లే సమయంలో కొవిడ్‌ నెగెటివ్‌ సర్టిఫికెట్‌ తప్పనిసరి చేసిన అమెరికా.. అక్టోబర్‌ 8 నుంచి దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయాణికులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇంతకు ముందు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఎఫ్‌డీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్లు పూర్తిగా రెండు డోసులు టీకా తీసుకున్న వారినే అనుమతిస్తామని పేర్కొన్నది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/