అమీర్‌పేట్‌ నుంచి హైటెక్‌సిటీ మెట్రో ప్రారంభం

హైదరాబాద్‌ : ఈ నెల 20 నుండి అమీర్‌పేట్‌, హైటెక్‌సిటీ మద్య మెట్రో సేవలు ప్రారంభం కానున్నాయి.అమీర్‌పేట్హైటెక్‌సిటీ మార్గం లో రైళ్లు ప్రారంభమైతే ప్రజలకు వేగమైన, సౌకర్యవంతమైన ప్రయా ణం అందుబాటులోకి వస్తుంది. హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టులో ఇప్పటికే మియాపూర్ ఎల్బీనగర్ (29 కి.మీ), నాగోల్అమీర్‌పేట (17కి.మీ.) మార్గం ప్రయాణికులకు ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. అమీర్‌పేట్‌, హైటెక్‌సిటీ మార్గంలో 9 స్టేషన్లు అవి అమీర్‌పేట్‌ , మధురానగర్(తరుణి),యూసుఫ్‌గూడ,జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్5,జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు,పెద్దమ్మ గుడి ,మాదాపూర్,దుర్గం చెరువు,హైటెక్‌సిటీ. అమీర్‌పేట, హైటెక్‌సిటీ మధ్య 11 కిలోమీటర్లు కూడా అందుబాటులోకి రానుంది. మొదటి దశలో మిగిలిన జేబీఎస్, ఎంజీబీఎస్ మధ్య 10 కిమీల దూరం, ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మెట్రో రూట్ కోసం పనులు జరుగుతున్నాయి.

https://www.vaartha.com/telengana/
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.