గిరాకీ లేదని ఐసీయూలో ఆక్సిజన్ సరఫరాను ఆపేసిన అంబులెన్సు డ్రైవర్లు

నిజామాబాద్ జిల్లాప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో దుశ్చర్య: పోలీసులు బడిత పూజ

Nizamabad: కరోనా మహమ్మారితో ప్రజలు అల్లాడుతుంటే ఇదే అదనుగా భావించి కొందరు అంబులెన్స్ డ్రైవర్లు కిరాతక చర్యకు ఒడిగట్టారు. తమకు గిరాకీ లేదని ఏకంగా ఐసీయూలోని కరోనా రోగులను చంపేందుకు కూడా వెనకాడలేదు వీరు. రోగులకు సీరియస్‌ అవ్వటం . మృతిచెందటం వల్ల తమకు కిరాయి వస్తుందని. ఆక్సిజన్ సరఫరాను ఆపేసి రోగుల ప్రాణాలతో చెలగాటమాడారు. ఈ దారుణాన్ని ఆసుపత్రి లోని వార్డుబాయ్ చూడడంతో వెలుగు చూసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఈ దుశ్చర్య జరిగింది.

పేషెంట్స్ దొరకడం లేదని.. గిరాకీ పెంచుకునేందుకు ముగ్గురు అంబులెన్స్ డ్రైవర్లు ఏకంగా ఐసీయూలో కరోనా రోగులకు ఆక్సిజన్‌ సరఫరాని ఆపేశారు. గమనించిన వార్డు బాయ్ వెంటనే అప్రమత్తం కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆక్సిజన్ ను ఆపేసిన ఓ ప్రైవేట్ అంబులెన్స్ డ్రైవర్‌ను గుర్తించి ఆస్పత్రి సిబ్బంది పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనను ఆస్పత్రి అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/