అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ పరీక్షలు వాయిదా

వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి ప్రకటన

Ambedkar Open University exams postponed
Ambedkar Open University exams postponed

Hyderabad: డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు వర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డా.ఏవీఎన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. . ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను ప్రభుత్వ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు ప్రకటించారు. అయితే ఈ పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ తరువాత ప్రకటిస్తామని పేర్కొన్నారు.

జాతీయ వార్తల కోసం: https://www.vaartha.com/news/national/