సర్వమానవ సౌభ్రాతృత్వానికి నిదర్శనం

నేడు అంబేద్కర్‌ జయంతి

Dr BR Ambedkar

అంబేద్కర్‌ సమస్త ప్రజల బతుకుల్లో అంధకారం పారద్రోలిన వెలుగుల ప్రస్థానం. ఆయన జీవతమే ఓ పోరాటం. సామాజిక సమానత్వం కోసం పోరాటం చేసిన అలుపెరుగని ఈ ఉద్యమకారుడు.

ఒక న్యాయవాద, ఆర్థికవేత్త, రాజకీయనాయకుడు సంఘ సంస్కర్త, బుద్దిస్ట్‌, అంట రానితనంపై ఎలుగెత్తిన ఉద్యమకారుడు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం పోరాడిన యోధుడు.

భారతదేశపు, తొలి న్యాయమంత్రి, రాజ్యాంగనిర్మాత. వీటన్నింటిని మించిన ‘భారతరత్న. ఈ భారతరత్న 1891లో మధ్యప్రదేశ్‌లో రామ్‌జిమాలోజి శన్‌పాల్‌, భీమాబాయి దంపతుల ఇంటి వరాలపుత్రునిగా జన్మించారు.

అంబేద్కర్‌ అగ్రకులాలవారి ఆధిపత్యపోరుని ఎదుర్కొంటూనే 1900లో ప్రభుత్వ పాఠశాలలో చేరాడు. పాఠశాలలో హేళనలు, అవమానాలపై తిరగబడ్డాడు. మనుష్యుల మధ్య అంతరాలేంటని ప్రశ్నించాడు. ఇలా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ మెట్రిక్యులేషన్‌ అత్యధిక మార్కు లతో పాసయ్యారు.

ఆ తర్వాత బి.ఎ.పాసయ్యారు. 1015లో కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఎ డిగ్రీ, 1916లో పిహెచ్‌డి విజయవంతంగా పూర్తి చేసి అందర్ని విస్మయపరిచాడు.

ఆ తర్వాత న్యాయశాస్త్రంలో కూడా పిహెచ్‌డి పూర్తిచేసి చదువుల తల్లి ముద్దుబిడ్డగా కొనియాబడ్డారు. అక్కడ అమెరికాలో నల్ల వారిపై స్వేతవర్ణాల వివక్షను చూసి సహించేలేకపోయారు.

అవన్ని చూసి ఆయనకు భారతేశంలో హరిజనులు గుర్తుకువచ్చి మరింత బాధపడ్డారు. అదే సమయంలో అమెరికాలో రాజ్యాం గంలో కొన్ని ప్రత్యేక సవరణలు అంబేద్కర్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి.

అలాంటి చట్టాలను ప్రవేశపెట్టాలని తన దృఢనిశ్చయంతో ఉన్నాడు. బారిస్టర్‌ పూర్తిచేసి ఇండియాకు తిరిగివచ్చి దళితులు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిపెట్టారు. ఇలాంటి సమస్యల్ని ఎదిరించాలంటే చదువొక్కటే మార్గమని తలంచాడు.

అందుకే తన వర్గంలోని ప్రజలకు చదువుని చెప్పించి ప్రోత్సహించారు. ‘బహిష్కృత హితకారిణి అనే సంస్థను స్థాపించి అస్పృశ్యతపై పోరాటం చేశారు.

మనుష్యులందరి రక్తం ఎరుపైనపుడు అంటరానితనం ఎందుకని ప్రశ్నించారు. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని, మనుధర్మాన్ని వ్యతిరేకించారు. అందుకే ఆయన అందరికి వెలుగురేఖ అయ్యారు. అంబేద్కర్‌ కొద్దిరోజులు బరోడా సంస్థానంలో మహారాజుగారి మిలటరీ కార్యదర్శిగా విధులు నిర్వ ర్తించారు.

మమారాజు వారి సహకారంతో అంబేద్కర్‌ ముఖ నాయక్‌ అనే పక్షపత్రికకు సంపాదకత్వం బాధ్యతలు చేపట్టారు. 1927లో దళిత జాతుల మహాసభ జరిగింది. మహారాష్ట్ర, గుజ రాత్‌ల నుండి కొన్ని వేల మంది వచ్చారు.

మహత్‌ చెరువులోని నీటి తాగడానికి వారికి అనుమతి లభించలేదు. కాని అంబేద్కర్‌ నాయ కత్వంలో ఆ చెరువులోని నీటిని తాగి సంచలనం సృష్టించారు. 1931లో రౌండ్‌టేబులో సన్నాహాలు సందర్భంగా అంబేద్కర్‌ గాంధీజీని కలుసుకున్నారు.

వీరి ఆశయాలు, సిద్ధాం తాలు గాంధీజీని అమి తంగా ఆకట్టుకున్నాయి. గాంధీజి భావాలని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగారు. అందుకే అంబేద్కర్‌ రాజకీయ జీవితం అనన్య సామాన్యం. అన్నింటిని మించి రాజ్యాంగరచన బహుజనులకు గొప్ప బహుమానం.

దేశానికి దశ, నిర్దేశం. కడవరకు అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు. స్వాతంత్య్రభారతావనికి తొలి న్యాయశాఖ మంత్రి. ఇంకా ఇండిపెండెంటు ఇండియాకు రాజ్యాంగరచన బాధ్యతలను నాటి తొలికాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.

భారతరాజ్యాంగ పరిషత్‌ నియమించిన రాజ్యాంగ సంఘానికి ఆయనను అధ్యక్షునిగా నియమించి సముచిత గౌరవానిచ్చారు. అదే ఆయన జీవితంలో మహోజ్వల మలుపుచరిత్రలో ఓ శాశ్వతమైన సాథనాన్ని కల్పించిన మహత్తరమైన ప్రస్థానం.

బడుగువర్గాలకు వెలుగును పంచిన సందర్భం. అనేక రాజ్యాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసి ఒక స్థిరమైన, దృఢమైన రాజ్యాంగాన్ని, భరతమాతకు బహుమా నంగా అందించారు. ఈ మేధావి. తరతరాలుగా బడుగు, బలహీనవర్గాల కష్టాల్ని గట్టెక్కిస్తూ వారి అభ్యున్నతకి రిజర్వేషన్లు కల్పించి వారి జీవితాల్లో వేయికాంతుల వెలుగుల్ని నింపారు.

అలాగే అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా చేస్తూ ఒక సూత్రాన్ని కూడా చేర్చారు. ఇలా రాజకీయాల్లో రాణిస్తూ గొప్ప ‘ఆర్థికవేత్తగా కూడా ఎంతోగొప్పగా పేరు సంపాదించారు. పారిశ్రామికీకారణ, వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మారు.

వ్యవసాయంలో అత్యధిక పెట్టుబడులు పెట్టాలని, చక్కని సూచ నలు కూడా చేశారు. ఇంతింతె, వటుడింత్తె అన్న చందానా అన్నిరంగాలలో ఎంతో గొప్పగా రాణిస్తూ సాహితీమాత ముద్దు బిడ్డగా కూడా వినుతికెక్కారు.

ఆర్థిక శాస్త్రానికి సంబంధించి అనేక రచనలు కూడా చేశారు. ఒకవైపు అంటరానితనంపై పోరాటం చేస్తూనే ఎన్నో రచనలు చేశారు.

అస్పృశ్యత ఎలా మొదలైందన్న నేపధ్యంలో ఓ చక్కని పుస్తకాన్ని, అద్భుతంగా రాశారు.

సర్వ మానవ సౌభ్రాతృత్వం కోసం పోరాటం చేసి చట్టసభల్లో దళితుల సర్వం వినిపించిన గొప్ప పార్లమెంటేరియన్‌.

ఇంకా భారతదేశ రాజ్యాంగంలో సామాన్యునికి ఆకాశమంత పీట వేసేలా చొరవ చూపిన గొప్ప దాశనికుడు.శాసనవ్యవస్థ, న్యాయవ్యవస్థ, కార్య నిర్వాహక, వ్యవస్థల స్వతంత్రతకు స్వతంత్రతకు కృషి చేసిన మహామనిషి.

స్వాతంత్య్రద్యోమ చరిత్రలో ఆయన పోరాట పటిమ అనంతరం,అనన్య సామాన్యం.భారతరాజ్యాంగ నిర్మాతగా ఆయన కృషి అభినందనీయం. మనిషికి మనిషికి మధ్యన ఉన్న తేడాలను రూపుమాసి లోకకల్యాణం కోసం క్పుషి చేసి మహోన్నత పురాణ పురుషుడు.

ఆయన అంతిమంగా మనుష్యులంతా ఐక్యంగా జీవిం చాలని కాంక్షించారు. మనుష్యులంతా సోదరభావంతో పరస్పరం కలసిమెలసి ప్రేమతో సౌభ్రాతృత్వంలో ఒకరికొకరు సహకరించు కుంటూ జీవించాలని జాతిని జాగృతం చేసినగొప్ప చైతన్యమూర్తి.

ఈ చైతన్యమూర్తి డాక్టర్‌ దాదాసాహెబ్‌ అంబేద్కర్‌ అధ్యయనం, సంఘటిత, పోరాటం అంటూ నేటి యువకు తారకమంత్రోపదేశం చేసి 1956 డిసెంబర్‌ 6న భువి నుండి దివికేగారు.

  • పింగళి భాగ్యలక్ష్మి

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/