పవన్ కళ్యాణ్ ను జోకర్ తో పోల్చిన అంబటి

Ambati who compared Pawan Kalyan with Joker

Community-verified icon


ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహంవ్యక్తం చేస్తూ..పవన్ కళ్యాణ్ ను జోకర్ తో పోల్చారు. అమరావతిలో నిర్మాణాలు, స్థలాలపై డెడ్లైన్ పెట్టి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్ట్ స్టే విధించడం పట్ల రాంబాబు స్పందించారు. రాజధానిని నిర్ణయించాల్సింది, నిర్మించాల్సింది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే కానీ న్యాయ స్థానాలు కాదని సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజధానిపై సుప్రీం కోర్పును ఆహ్వానిస్తున్నామని మంత్రి తెలిపారు.

వికేంద్రీకరణ విషయంలో ప్రభుత్వం సుప్రీం కోర్టుకు అప్పిల్‌కు వెళ్లడం జరిగింది. వికేంద్రీకరణపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు సుప్రీం కోర్టు ఒక మధ్యంతర ఉత్తర్హులు ఇచ్చింది. మూడు మాసాల్లో, లేదా ఆరు మాసాల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇది వికేంద్రీకరణకు బలాన్ని ఇచ్చే అంశంగా వైస్సార్సీపీ పార్టీభావిస్తోందన్నారు. దాంతో పాటు సుప్రీం కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది, ఈ వ్యాఖ్యలు కూడా మీడియాలో చూశాం. న్యాయ స్థానాలు టౌన్‌ ప్లానర్స్‌ కాదు..వారు టౌన్‌ ప్లాన ర్స్‌గా వ్యవహరించడం సరైన విధానం కాదని చెప్పింది. ఈ వ్యాఖ్యలు గమనిస్తే..రాజధానుల నిర్ణయంలో న్యాయ స్థానాల జోక్యం సరైంది కాదని నా అభిప్రాయం. రాజధానులు నిర్ణయించవలసింది. నిర్మించాల్సింది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు, లేదా దేశ రాజధాని అయితే కేంద్ర ప్రభుత్వమే తప్ప న్యాయ స్థానాలు కాదు. రాజధానులు ఎక్కడ ఉండాలో చెప్పాల్సింది న్యాయ స్థానాలు కాదని సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టమవుతుందని రాంబాబు అన్నారు.

రైతుల వేషాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకున్నారని ఆరోపించారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా విమర్శలు గుప్పించారు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ రాజకీయాలలో ఒక పెద్ద జోకర్ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పటికైనా చంద్రబాబు రాజధానులకు అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు మానుకోవాలని హితవుపలికారు.