మళ్లీ వస్తున్నా అంబటి రాయుడు

సీనియర్ల హితబోధతో నిర్ణయం మార్పు
హెచ్ సీఏ వర్గాలకు లేఖ

Ambati Rayudu
Ambati Rayudu

హైదరాబాద్‌: తెలుగు క్రికెటర్ అంబటి రాయుడువరల్డ్ కప్ కోసం ఎంపిక చేసిన టీమిండియాలో తనకు చోటు కల్పించకపోవడం పట్ల భారత సెలెక్టర్ల బృందంపై అలకబూనిన సంగతి తెలిసిందే. దీంతో ఇక క్రికెట్ ఆడలేనంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ కు అన్ని ఫార్మాట్లలో రిటైర్మెంటు ప్రకటించాడు. కాగా అంబటి రాయుడు మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కొన్నివారాల కిందట ప్రకటించిన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నాడు. ఈ మేరకు హైదరాబాద్ క్రికెట్ సంఘానికి రాసిన లేఖలో స్పష్టం చేశాడు. అన్ని ఫార్మాట్లలో ఆడతానని రాయుడు తన లేఖలో పేర్కొన్నాడు. శ్రేయోభిలాషుల హితబోధతో రాయుడు మనసు మార్చుకున్నట్టు అర్థమవుతోంది. తన లేఖలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. రిటైర్మెంటుపై పునరాలోచన విషయంలో చెన్నై సూపర్ కింగ్స్ పెద్దలతో పాటు వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్ తనకు మార్గదర్శనం చేశారని రాయుడు వెల్లడించాడు. కష్టకాలంలో వారు అండగా నిలిచారంటూ కృతజ్ఞత వ్యక్తం చేశాడు. తనలో ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుందన్న విషయాన్ని వారు గుర్తు చేశారని, రిటైర్మెంట్ నిర్ణయం తీవ్ర భావోద్వేగాల నడుము తీసుకున్నదని రాయుడు తెలిపాడు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/